సిటీబ్యూరో, జూన్ 22 ( నమస్తే తెలంగాణ ): క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా యువజన, క్రీడా అధికారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో ఈనెల 27 నుంచి 30 వరకు ఉదయం 8 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.1-9-2015 నుంచి 31-8-2016 మధ్య జన్మించిన వారు అర్హులని, వివరాలకు 040-27900649 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు.