హైదరాబాద్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు ఉపకరణాలు అందజేస్తామని దివ్యాంగుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత సంస్థ డైరెక్టర్ శైలజ తెలిపారు. ఇందుకు అర్హులైన దివ్యాంగులు మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు హైదరాబాద్ మలక్‌పేటలోని తమ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు.