ఫిరాయింపులపై నేటి నుంచి విచారణ.. తొలిరోజు నలుగురు ఎమ్మెల్యేలకు పిలుపు
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లను విచారించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు.
- వచ్చే నెల 6వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు
- ఫిరాయింపుదారులు, ఫిర్యాదుదారులు, లాయర్లు ఫోన్లు, గడియారాలు తీసుకురావొద్దని ఆదేశాలు
- అసెంబ్లీ లోపలికి మీడియా రావడంపైనా నిషేధం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన (Defection MLAs) ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లను విచారించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. తొలిరోజు నలుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది. వీరు న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతారు. వీరి మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ సైతం ట్రిబ్యునల్ ముందు హాజరు కానున్నారు.
ప్రజాప్రతినిధులు, మీడియాపై ఆంక్షలు
శాసనసభ భవనాల ప్రాంగణంలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. అక్టోబర్ 6వరకు అమలులో ఉంటాయన్నారు. ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే పిటిషనర్లు, ప్రతివాదులు, వారికి సంబంధించిన న్యాయవాదులు కోర్టుహాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విచారణ కార్యకలాపాలను రికార్డ్ చేసినా, ఫొటోలు తీసినా ఫోన్లను జప్తుచేస్తామన్నారు.
- ముందస్తు అనుమతి లేకుండా శాసనసభ భవనాల ప్రాంగణంలోకి సందర్శకులను అనుమతించరు.
- శాసనసభ భవనాల ప్రాంగణంలోకి మీడియా సిబ్బందికి అనుమతి లేదు.
- మీడియా పాయింట్ల వద్దగానీ, శాసనసభ భవనాల ప్రాంగణంలోగానీ ఫిర్యాదుదారులు, పిటిషనర్లు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వొద్దు.
- ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను వారి శాసనసభ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతిస్తారు.
- మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలను శాసనసభ భవనాల ప్రాంగణంలోకి అనుమతించరు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

