హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కెమిస్ట్రీతోపాటు లైఫ్ సైన్సెస్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తిచేసిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం ఈ నెల 5, 8న ఇంటర్వ్యూకు హాజరుకావాలని అధికారులు సూచించారు.