హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఆధ్వర్యంలో జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 22 నుంచి 30 ఏండ్ల వయసుతోపాటు గుర్తింపు పొందిన కళాశాల నుంచి నర్సింగ్‌లో డిప్లొమా, ఏఎన్ఎం పారా మెడికల్ చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై, వృత్తిపరమైన నైపుణ్యాలపై శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9951909863, 9573945684 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు5 (నమస్తే తెలంగాణ): ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. రోజుకు 100 మంది చొప్పున ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభించగా, 14వరకు కొనసాగనున్నది. గత సీజన్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ అర్హుల జాబితాను బీసీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం.