హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): జర్మనీలో నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 9నుంచి 17 వరకు బేగంపేటలోని పర్యాటక భవన్లో ఇంటర్యూలు నిర్వహించనున్నట్టు టామ్‌కామ్ తెలిపింది. జర్మనీకి చెందిన ట్రిపుల్ విన్ (టీడబ్ల్యూపీ) ప్రాజెక్టులో భాగంగా ఈ ఎంపిక నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది.
‘పెండింగ్ వేతనాలు మంజూరు చేయండి’
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలను వెంటనే మంజూరుచేయాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. 4 నెలలుగా వేతనా లు లేక, రెన్యువల్ జీవో రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.