హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి చెందిన ఉదావత్ లచ్చిరాం ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయన హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషిచేయడం, దాతల ద్వారా విద్యాసౌకర్యాలు కల్పించడంతో లీగ్ అకాడమీ ప్రొఫెషనల్ ఇంటర్ డిసిప్లినరీ సొసైటీ, నిరోజ గ్రీన్ ఇండియా పరివార్ లచ్చిరాంను ఈ అవార్డుకు ఎంపికచేశాయి.