హైదరాబాద్ జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు tgbie.cgg.gov.in, results. cgg.gov.in వెబ్సైట్లలో మార్కుల వివరాలు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రేపటి నుంచి టీజీఈసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్ జూన్ 15 (నమస్తే తెలంగాణ): టీజీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 14లోగా స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో చేపట్టనున్న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని టీజీఈసెట్-25 కన్వీనర్ వెల్లడించారు. అర్హత ఆధారంగా ఈ నెల 25లోగా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.