Khammam | శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
ఖమ్మం అర్బన్: ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయం 6.30 గంటలకు గమనించిన తోటి విద్యార్థులు.. సిబ్బందికి వెల్లడించారు. దీంతో ఆమెను పట్టణంలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలసుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్ వద్ద ఆందోళకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది హైదరాబాద్‌లోని మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి కౌశిక్ రాఘవ (17) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కౌశిక్.. హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

