హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు మరోసారి పొడిగించింది. రూ. 2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారంతా ఈ నెల 16లోపు ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య సూచించారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) స్కూల్ బోర్డు సభ్యుడిగా రాష్ర్టానికి చెందిన డాక్టర్ బానోత్ ధర్మ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేండ్లపాటు కొనసాగనున్నారు. ఇగ్నో ఇటీవలే నియామకపు ఉత్తర్వులు జారీచేసింది. డాక్టర్ బానోతు ధర్మ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థి సేవల విభాగం జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వర్సిటీ అధికారులు ధర్మను అభినందించారు.