సబ్‌రిజిస్ట్రార్ ఆస్తులు 2.94 కోట్లు
నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు.
- నెల క్రితం ఏసీబీకి చిక్కిన తస్లీమా..
- ఒకేసారి ఐదు చోట్ల అధికారుల తనిఖీ
సుబేదారి, ఏఫ్రిల్ 22: నెల క్రితం ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్ అయిన మహబూబాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నివాసాల్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల 94 లక్షల ఆస్తులు ఉన్నట్టు నిర్ధారించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసునమోదు కావడంతో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో హనుమకొండలోని కాకతీయ కాలనీలోని తస్లీమా నివాసం, యాదవనగర్తోపాటు సూర్యాపేటలోని కుటుంబసభ్యులు, భూపాలపల్లిలోని డాక్యుమెంటరీ రైటర్స్ ఇండ్లల్లో సోదాలు చేపట్టారు.
ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. డాక్యుమెంట్లు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు ఇండ్ల విలువ రూ.27 లక్షలు, 6 ఓపెన్ ప్లాట్ల విలువ రూ.12 లక్షలు, 3 ఎకరాల వ్యవసాయ భూమి విలువ రూ.20 లక్షల 40 వేలు, వాహనాల విలువ రూ.23 లక్షల 66 వేలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.98,787తోపాటు నగదు రూ.1,92,900 ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. తస్లీమా మొత్తం ఆస్తుల విలువ రూ.2 కోట్ల 94 లక్షల 547 ఉన్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారని, ఇంకా విచారణ కొనసాగుతున్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

