బడ్జెట్లో న్యాయశాఖకు అన్యాయం!
తెలంగాణ న్యాయశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. ‘సత్వర న్యాయం-సమ న్యాయం’ అంటూనే న్యాయశాఖ లక్ష్యాలను తుంగలో తొక్కింది.
- వరుసగా మూడు బడ్జెట్లలో తగ్గుదల
- ఈసారి రూ.2,367 కోట్లకే పరిమితమైన పద్దు
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. ‘సత్వర న్యాయం-సమ న్యాయం’ అంటూనే న్యాయశాఖ లక్ష్యాలను తుంగలో తొక్కింది. న్యాయశాఖలో అవసరమైన మౌలిక వసతులకు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామంటూనే అతి తక్కువగా కేటాయింపులు చేసింది. ఈ బడ్జెట్లో న్యాయశాఖకు రూ.2,367 కోట్లను కేటాయించగా.. హైకోర్టు, జడ్జిల నివాసాలను రూ.2,583 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నామని బడ్జెట్లో పొంతనలేని విధంగా మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతోపాటు 11 జిల్లా కోర్టులు, 2 సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, మరో 46 కోర్టుల నిర్మాణానికి అనుమతులిచ్చామని అన్నారు.
న్యాయశాఖకు ప్రత్యేకంగా ఓ మంత్రి లేకపోవడంతో అక్కడ జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించేవారు లేరని పలువురు న్యాయవాదులు వాపోతున్నారు. 2024-25 బడ్జెట్లో రూ.3,245 కోట్లు, 2025-26లో రూ.2,453 కోట్లు, 2026-27లో రూ.2,367 కోట్లు కేటాయింపులు చేస్తూ.. వరుసగా తగ్గిస్తూ వచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, న్యాయ సేవలను మెరుగుపరచడంలో భాగంగా కోర్టుల ఆధునికీకరణ, న్యాయ వ్యవస్థ బలోపేతానికి ఈ నిధులు ఎటూ సరిపోవని న్యాయవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర న్యాయశాఖలో సిబ్బంది కొరత, లక్షల కేసుల పెండింగ్ సహా అనేక సవాళ్లు ఉన్నా యి. వెరసి బాధితులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతున్నదని న్యాయవాదులు అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

