పల్లె ప్రగతితో అంటు వ్యాధులు దూరం : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలాలు అనుభవంలోకి వస్తున్నాయి.

వరంగల్ అర్బన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసిఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలాలు అనుభవంలోకి వస్తున్నాయి. అందువల్లే మన రాష్ట్రంలో విష జ్వరాలు, అంటూ వ్యాధులు బాగా తగ్గాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పల్లె ప్రగతి వల్ల అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి.
గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలు అనేవారు. ఇప్పుడు మున్సిపాలిటిలు అభివృద్ధికి మారు పేరుగా తయారు అవుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో మంత్రి పర్యటించారు. పల్లె ప్రగతితో అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలిపారు.
గతంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలు అనేవారు. ఇప్పుడు మున్సిపాలిటీలు అభివృద్ధికి మారు పేరుగా తయారు అవుతున్నాయని పేర్కొన్నారు. ఏటా రూ.250 కోట్లు ఇస్తూ వరంగల్ నగరాన్ని సీఎం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తెలిపారు. బీసీ మహిళకు వరంగల్ మేయర్ గా గొప్ప అవకాశం కల్పించారు.
అందుకు సీఎం కు ధన్యవాదాలన్నారు. అంతకు ముందు భద్రకాళి దేవాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, ఇతర నేతలు, అధికారులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

