పటాన్చెరు, జూలై 20 : దక్షిణకొరియా ప్రభుత్వ సహకారంతో, ఇండో-కొరియన్ ప్రాజెక్టులో భాగంగా గీతం వర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నాలుగు విండ్ టర్బయిన్లను దక్షిణ కొరియా బృందం బుధవారం సందర్శించింది. గాలివేగాన్ని వీక్షించడంతో పాటు స్వదేశీ-కొరియా నమూనాల పనితీరును పోల్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని గీతం వర్సిటీ మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పీ శ్రీనివాస్ తెలిపారు.
ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే డాటాను విశ్లేషించడానికి గీతం వర్సిటీ ఓ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎస్కో-ఆర్టీఎస్, చెంజూ వర్సిటీ, జేఐఎస్, గీతం, ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు శ్రీనివాస్ తెలిపారు. విండ్ టర్బైన్లను విజయవంతంగా అమర్చిన స్థానిక పరిశోధకులను కొరియా ప్రతినిధుల బృందం అభినందించింది. కార్యక్రమంలో గీతం-హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎన్ రావు, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.