మహాముత్తారం, జనవరి 4 : ఇందిరమ్మ ఇల్లు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే అధికారి టీఏ ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే అధికారి, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ సర్వే కోసం ఇంటింటికీ రూ.500 చొప్పున వసూలు చేశాడని పలువురు బాధితులు గత డిసెంబర్ 31న ఎంపీడీవోకు ఫిర్యా దు చేయగా, ఈ నెల ఒకటిన ‘నమస్తే తెలంగాణ’లో ‘పైసలిస్తేనే ఇందిరమ్మ ఇ ల్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.
కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఎంతమంది ఇచ్చారు? అని బాధితులను అడిగి తెలుసుకొని కలెక్టర్‌కు నివేదించారు. ఆ మేరకు సర్వే అధికారి టీఏ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు.