న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్‌తో నడిచే ఓడ వారణాసిలో జలప్రవేశం చేసింది. గురువారం నమో ఘాట్ వద్ద కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఓడ వాణిజ్య సేవల్ని జెండా ఊపి ప్రారంభించారు. సాంకేతికంగా భారత్ సామర్థ్యాన్ని, గ్రీన్ ఎనర్జీ పట్ల నిబద్ధతను ఇది చాటుతున్నదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఈ తరహా టెక్నాలజీ కలగిన చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ దేశాల సరసన భారత్ నిలిచిందని చెప్పారు.