ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) అరంగేట్రం సీజన్‌కు రంగం సిద్ధమైంది. హుసేన్సాగర్ తీరాన ఫార్ములా కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకుపోయేందుకు రెడీ అయ్యాయి. ఆరు ప్రధాన నగరాల సమాహారంతో శని, ఆదివారాల్లో హోరాహోరీగా రేసింగ్ జరుగనుంది. దేశంలో స్ట్రీట్ సర్క్యూట్‌కు తొలిసారి ఆతిథ్యమిస్తున్నహైదరాబాద్ అందుకు తగ్గట్లు ముస్తాబైంది. మెరుపు వేగంతో రేసర్లు టాప్‌గేర్‌లో దూసుకెళ్లేందుకు సై అంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి రేసర్లు పోటీపడుతున్న రేసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో రేసు నిర్వహిస్తున్నది. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా అంతర్జాతీయ స్థాయిలో ట్రాక్‌ను తీర్చిదిద్దారు. మరి ఇంకెందుకు ఆలస్యం రెప్పపాటులో బుల్లెట్లా దూసుకెళ్లే రేసింగ్‌ను చూసేందుకు మీరూ సిద్ధమైపోండి.
నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి టోర్నీలకు ఆతిథ్యమిచ్చిన భాగ్యనగర సిగలో ఫార్ములా రేసింగ్ చేరబోతున్నది. ఐపీఎల్ తరహాలో ఆరు ఫ్రాంచైజీల కలయికతో రూపుదిద్దుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)కు హైదరాబాద్ తొలి వేదిక కాబోతున్నది. ప్రతిభ కల్గిన యువ రేసర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్పీపీఎల్) ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నది.
హైదరాబాద్, చెన్నై ఆతిథ్యమిస్తున్న లీగ్ మొదటి సీజన్లో మొత్తం 24 మంది రేసర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ గార్డెన్, ఐమ్యాక్స్, మింట్ కాంపౌండ్, నూతన సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను ఆనుకుని 2.7కిలోమీటర్ల ట్రాక్‌ను రూపొందించారు. 17 మలుపులతో అంతర్జాతీయ హంగులకు తగ్గట్లు రేసర్లకు పరీక్ష పెట్టే విధంగా ట్రాక్‌ను డిజైన్ చేశారు. ఓవైపు సాగర్ జలాలు, మరోవైపు పచ్చని ప్రకృతి మధ్య రేసింగ్ హీట్ పెంచనుంది. రేసింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభిమానుల కోసం స్టాండ్లను నిర్మించారు. శనివారం క్వాలిఫయింగ్తో పాటు రేస్-1 జరుగనుంది. ఇందుకోసం రేసింగ్ జరిగే హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆదివారం ప్రధాన రేస్ జరుగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐఆర్‌ఎల్‌లో వోల్ఫ్ జీబీ08 ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అప్రిలియా 1100సీసీ సామర్థ్యంతో ఈ ఇంజిన్ రూపొందించారు. 220 బీహెచ్పీ కల్గిన థండర్ కారు కోసం ఇండియన్ ఆయిల్ హై ఆక్టేన్ పెట్రోల్‌ను వినియోగిస్తారు. కారు బరువు 380 కిలోలు కాగా గరిష్ఠంగా గంటకు 240కి.మీల వేగంతో దూసుకెళుతుంది. కారు పొడవు 4 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు.
ఫార్ములా-3కి సమానమైన ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం ఇటలీకి చెందిన వోల్ఫ్ రేసింగ్ కార్లను రూపొందించింది. సింగిల్ సీట్‌తో అప్రిలియా ఇంజిన్లతో కార్లను తయారు చేశారు.
రేసులో పాల్గొనే జట్లు
1)హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్
2) స్పీడ్ డీమాన్స్ ఢిల్లీ
3) బెంగళూరు స్పీడ్‌స్టర్స్
4) చెన్నై టర్బో రైడర్స్
5) గోవా ఏసెస్
6) గాడ్ స్పీడ్ కొచ్చి
హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు
అనిందిత్‌రెడ్డి
అఖిల్ రవీంద్ర
నీల్ జానీ
లోలా లవీన్స్ ఫోస్
శనివారం రేసింగ్ షెడ్యూల్
మధ్యాహ్నం: 3.10-3.20 వరకు
క్వాలిఫయింగ్ 1
మధ్యాహ్నం: 3.30-3.40 వరకు
క్వాలిఫయింగ్ 2
సాయంత్రం: 4.00-4.45 వరకు రేస్-1
సాయంత్రం: 4.45-5.00 వరకు
పోడియం, ఇంటర్వ్యూలు
ఐఆర్ఎల్ సీజన్-1 షెడ్యూల్
నవంబర్ 19, 20 హైదరాబాద్
స్ట్రీట్ సర్క్యూట్
నవంబర్ 25, 27 ఎమ్ఐసీ చెన్నై
డిసెంబర్ 2, 4 ఎమ్ఐసీ చెన్నై
డిసెంబర్ 10, 11 హైదరాబాద్
స్ట్రీట్ సర్క్యూట్