హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో ఈ నెల 8 నుంచి 10 వర కు ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్పో (ఇండ్ ఎక్స్పో) నిర్వహించనున్నారు. సూ క్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల మంత్రిత్వశాఖ సహకారం తో జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఐసీ), ఇతర వాణిజ్య సంఘాలు, ఇండోర్ ఇన్ఫోలైన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ని ర్వహిస్తారు. ఈ ప్రదర్శన లో పరిశ్రమలకు చెందిన నిపుణులు, తయారీదారు లు, సరఫరాదారులు, ఔత్సాహికులు పాల్గొననున్నారు. తయారీరంగ పరిశ్రమల్లో వస్తున్న ఆధునిక విధానాలు, అవసరాలకు తగ్గట్టుగా యంత్రాల త యారీ, పరిశ్రమ భవిష్యత్తు అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నట్టు ఇన్ఫోలైన్ ఎండీ రాజ్‌కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ప్రదర్శన నాలెడ్జ్-షేరింగ్, నెట్ వరింగ్, వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. 150కిపైగా ఎగ్జిబిటర్లు, హ్యాండ్టూల్స్, మెషిన్ టూల్స్,రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ ప్రొడక్ట్స్, ఇతర పరిశ్రమలకు చెందిన 20 వేలకు పైగా ఉత్పత్తులను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు.