శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 00:46:07

జోరు పెరిగిన రిజిస్ట్రేషన్లు

జోరు పెరిగిన రిజిస్ట్రేషన్లు

  • ఒక్క రోజే రూ. 430 కోట్ల రాబడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ బుధవారం కిటకిటలాడాయి. రద్దీని బట్టి అదనపు సిబ్బందిని నియమించాలని ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్‌ శేషాద్రి ఆదేశించారు. మొన్న టివరకు రోజుకు 3 వేల వరకు ఉన్న దస్తావేజుల రిజిస్ట్రే షన్లు బుధ వారం ఒక్కసారిగా 4,600కు పెరిగాయి. సరాసరి రాబడి రూ.360 కోట్లు ఉండగా.. బుధవారం రూ.430 కోట్లు వచ్చింది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లతో రూ. 2,400 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తున్నది. 


logo