పటాన్చెరు రూరల్, మార్చ్ 28 : తమ ఫ్లాట్స్ తమకు అప్పగించాలని సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ప్రముఖ నిర్మాణ సంస్థ లేక్సిటీ ఎదుట ఫ్లాట్లు కొన్న బాధితులు ఆందోళ న నిర్వహించారు. శనివారం పటాన్చెరులో నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్టు లేక్సిటీలో ఫ్లాట్లు కొన్నవారు ప్లకార్డులు పట్టుకుని తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లను తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంకార్ సంస్థ మాటలు నమ్మి లేక్సిటీలో ఐదేండ్ల క్రితం ఫ్లాట్లు బుక్ చేసి కొన్నామని వెల్లడించారు. 60 నుంచి 90 శాతం వరకు పేమెంట్లు చెల్లించామన్నారు. 2024 జూన్లో ఈ అపార్టుమెంట్లలో ఫ్లాట్లు తమకు హ్యాండోవర్ చేయాల్సి ఉందని చెప్పా రు. 2019 నుంచి 2020లో ఫ్లాట్లు బుక్ చేసుకున్నామని, ఇప్పటికీ వాటిని హ్యాండోవర్ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
60 లక్షలనుంచి రూ. కోటి వరకు చెల్లించి, లేక్సిటీ చుట్టు తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తంచేశా రు. నిర్మాణ సంస్థ బిల్డర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చిందని.. వారికి పేమెంట్లు ఇవ్వకపోవడం తో నిర్మాణం పనులు నిలిచిపోయాయని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి డబ్బులు కట్టామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. తమ ఫ్లాట్లు తమకు అప్పగించాలని , లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.