హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతున్నాయని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. గురువారం ఆయన నగరంలోని హైటెక్‌సిటీ యశోద బ్రాంచిలో పల్మనాలజీ స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ క్లినిక్ ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్మనాలజీ వైద్యులు డాక్టర్ సందీప్ సాల్వి (పుణె), డాక్టర్ ఇందర్‌పాల్ ఎస్ సెహగల్ (ఛండీగఢ్), డాక్టర్ ఆర్ విజయకుమార్, డాక్టర్ జీకే పరమజ్యోతోహి, డాక్టర్ సుభాకర్ కంది (హైదరాబాద్ )తో పాటు దేశవ్యాప్తంగా 200 మంది వైద్యులు పాల్గొన్నారు.