యాదాద్రి భువనగిరి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో గిరిజనులు టీఆర్ఎస్కే జై కొట్టారు. మెజారిటీ తండాలు టీఆర్ఎస్కే అండగా నిలిచాయి. నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో అధికంగా తండాలు ఉన్నాయి. ఈ మండలాలు మొదటి నుంచీ టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నాయి.
నాంపల్లి మండలంలోని దేవత్‌పల్లి(330 ఓట్లు), ముష్టిపల్లి(374), తుంగపహాడ్(192)తోపాటు నామ్నాయక్తండా, జాన్‌తండా, రజ్యతండా, రేఖ్యాతండా, రాందాస్తండాల్లో భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. మర్రిగూడెం మండలంలోని అంతంపేట(264 ఓట్లు), ఖుదాభక్షుపల్లి(45 8), అజిలాపురం(463), కొండూరు (397), మర్రిగూడ(504), రాజాపేటతండా(392), కమ్మగూడెం(315), సరంపేట(666) గ్రామాల గిరిజనులు టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నారాయణపురం మండలంలోని పొర్లగడ్డ్డ తండా, వెంకంబావితండా, రాచకొండ, మర్రిబావి, పల్లగట్టు, కడపగండి, వాచ్చతండాల ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలిచారు.