హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ టీబీ సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్ ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా నిబంధనల మేరకు అమలు చేసేందుకు ప్రయత్నించాలని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రా మకృష్ణారావు.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పాదర్శక, సులభతర పౌరసేవలను అందిస్తున్నామని చెప్పారు.