విద్యానగర్, అక్టోబర్ 28: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా (ఎలక్టెడ్) 2024-25 సంవత్సరానికి గాను కరీంనగర్‌కు చెందిన ప్రము ఖ డాక్టర్ కిషన్ గెలుపొందినట్టు రాష్ట్ర శా ఖ ప్రకటించింది. ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ పొలాస రాంకిరణ్ గెలుపొందినట్టు వివరించింది. సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లుగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ రాజేశ్వర్, కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ అలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఎన్నిక పట్ల కరీంనగర్ ఐఎం ఏ బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎనమల్ల నరేశ్, డాక్టర్ నవీన్‌కుమార్ హ ర్షం వ్యక్తంచేశారు.
ఈఆర్సీకి కొత్త హంగులద్దాం: శ్రీరంగారావు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తన పదవీకాలంలో ఈఆర్సీకి కొత్త హంగులద్దానమి ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు తెలిపారు. ఈఆర్సీ చైర్మన్ బాధ్యతలను నుంచి ఆయన మంగళవారం వైదొలగనున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాము క్షేత్రస్థాయికి వెళ్లి దేశంలో ఎక్కడాలేని విధంగా వినియోగదారులకు ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. చట్టప్రకారం గల నిబంధనలు, ప్రమాణా లు ముద్రించి పుస్తకాలను అందజేశాం. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ పోర్ట ల్, ఈఆర్సీ ఆఫీసులో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. విద్యుత్తు ప్రమాదాల బారినపడి మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా త్వర గా అందించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. కేవలం 40 రోజుల్లోనే 9 పిటిషన్లపై బహిరంగ విచారణలు చేపట్టి ఆర్డర్లు జారీ చేసినట్టు వివరించారు. కేసీఆర్ సర్కారు సహకారంతో ఎ కరం స్థలంలో అద్బుత భవనాన్ని నిర్మించామని, పదవీకాలం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు.