Mahabubnagar | పాలమూరులో హైడ్రా తరహా కూల్చివేతలు..
రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు.
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కానసాగుతున్నది. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో పాలమూరులో కూడా అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మహబూబ్‌నగర్ మున్సిపల్ అధికారులు ఆదర్శనగర్‌లోని పేదల ఇండ్లను గురువారం తెల్లవారుజామున కూల్చివేశారు. భారీ బందోబస్తుతో రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లతో వచ్చిన అధికారులు.. పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలను నేలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు.
గతంలో ప్రభుత్వం తమకు పట్టాలి ఇచ్చిందని చెబుతున్నప్పటికీ వినకుండా అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని నిలదీశారు. తమకు నిలువనీడ లేకుండా చేశారంటూ బాధితులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్షగడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. కనీసం పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. దీంతో పట్టణంలో పేదల ఇండ్లు కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు పార్టీల నాయకులు వాళ్ల అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కులగోట్టకపోవడం గమనార్హం.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

