హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్కు చోటు దక్కడంపై ఆ విద్యాసంస్థ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో స్థానాన్ని సంపాదించుకోవడం గర్వకారణమని ఐఐటీహెచ్ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతేడాది ఐఐటీహెచ్ ర్యాంకు 601-650 ఉండగా, ఈ ఏడాది 591-600 ర్యాంకును సాధించిందని వివరించారు.