సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 18: కందిలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో ఆదివారం మూడవ అలుమ్ని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏడుగురు ఐఐటీయన్లకు స్పెషల్ అలుమ్ని ఎక్సలెన్స్ అవార్డులను అం దజేశారు. ఎక్సలెన్స్ ఇన్ అకడమిక్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ క్యాటగిరీలో డాక్టర్ అప్పిన బాలసుబ్రమణ్యం, డాక్టర్ వసీం అక్రమ్‌కు.. ప్రమోటింగ్ ఎంటర్ప్రెన్యూర్ క్యాటగిరీలో ఆయుష్ పటేరియా, శ్వేతా సురేశ్ థాకరేకి.. డిస్టింగ్విష్డ్ కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూట్ క్యాటగిరీలో అశ్విన్ నందపుర్కార్కు అవార్డులను ప్రదానం చేశారు.
డిస్టింగ్విష్డ్ కంట్రిబ్యూషన్ టు సొసైటీ అండ్ నేషన్ బిల్డింగ్ క్యాటగిరీలో డాక్టర్ అనేశ్ కుమార్ శర్మను, కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూట్ రిలేషన్స్ క్యాటగిరీలో సాయి కిరణ్ ఉపద్రష్టను ఎక్సలెన్స్ అవార్డులు వరించాయి. ఈ వేడుకల్లో ఐఐటీహెచ్ అలుమ్నీ రిలేషన్స్ డీన్ డాక్టర్ ముద్రిక ఖండేల్వాల్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులే మనకు పతాకధారులని పేర్కొన్నారు. ఐఐటీహెచ్‌కి మొత్తం 5,200 మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని, వారిలో 4,500 మంది సంస్థతో కలిసి ఉన్నారని ఖండేల్వాల్ తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ సప్తర్షి మజుందర్, స్టూడెంట్ డీన్ ప్రొఫెసర్ కే వెంకట సుబ్బయ్య, ప్రొఫెసర్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.