హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): శిలాజ ఇంధన వనరుల వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కృషి చేస్తున్నది. క్లీన్ ఎనర్జీగా పేరున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై పరిశోధనలు ముమ్మరం చేసింది. అతి చౌకగా తయారు చేసే విధివిధానాలపై అధ్యయనం చేస్తున్నది. కోబాల్ట్ టెర్పైరిడిన్ రసాయన మూలాకాన్ని వినియోగించి వాణిజ్యపరంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఐఐసీటీ పరిశోధకులు తెలుసుకుంటున్నారు.