IFS Officers | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్ ప్రదీప్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ బీ ప్రభాకర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించింది.