ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకే..
కలెక్టర్ ఎస్. వెంకట్ రావు | ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

మహబూబ్ నగర్ : ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉన్నత స్థాయి సమాచారం మేరకు జిల్లాలో ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి వారి పై ఉక్కుపాదం మోపటమే కాక సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రకటనలో తెలిపారు.
ఈ విషయమై జిల్లా పరిషత్ సిఈఓ ఆధ్వర్యంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, స్థానిక తాసిల్దార్, వన్ టౌన్ సిఐలతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఎవరైనా ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిసినట్లయితే అటువంటి వారిని జైలుకు పంపిండంతో పాటు వారి లైసెన్సులను రద్దు చేసి వారి మీద తీవ్రమైన క్రిమినల్ చర్యలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ విపత్కర పరిస్థితులలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద తీవ్రమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు కలెక్టర్, ఎస్పీలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్‌కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- high prices
- Jail
- oxygen
- అధిక ధరలు
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

