కోల్‌సిటీ, డిసెంబర్ 6 : రాష్ట్రంలో దళితులపై వివక్ష చూపవద్దని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని ప్రభుత్వానికి జా తీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాం చందర్ సూచించారు. రాష్ట్రంలో దళితులకు ఏమాత్రం నష్టం కలిగించినా ఊరుకునేది లేదని, అవసరమైతే సీఎంను కమిషన్ ఎదుట నిలబెడుతానని స్పష్టం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆలిండియా అంబేద్కర్యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రామగుండం బల్దియా కార్యాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం రా మగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దే శ వ్యాప్తంగా 11 రాష్ర్టాల్లో దళితుల ఆర్థిక అసమానతల గురించి నివేదికలు తయారు చేస్తున్నామని చెప్పారు. కోరుకంటి మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో దేశంలోనే ఏ ప్రభుత్వం సాహసించని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహంతోపాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొ ప్ప విషయమని కొనియాడారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపెల్లి సతీశ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.