Hyderabad | పంటి చికిత్సకు వెళ్తే ప్రాణం పోయింది..
పంటి చికిత్స కోసం డెంటల్ దవాఖానకు వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
- నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే విషాదం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- డెంటల్ దవాఖాన నిర్వాహకులపై కేసు
Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 19: పంటి చికిత్స కోసం డెంటల్ దవాఖానకు వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మిర్యాలగూడలోని సరస్వతినగర్‌కు చెందిన వింజం లక్ష్మీనారాయణ (28) తన కుటుంబంతో కూకట్పల్లి సమీపంలోని హైదర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటినొప్పి ఉండటంతోపాటు కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్లో చూడగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ దవాఖాన గురించి తెలిసింది.
నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్‌కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకరటింకరగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పగా.. చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పితోపాటు వాంతులు కావడంతోపాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు.
హుటాహుటిన అపోలో దవాఖానకు..
ఆందోళనకు గురైన ఎఫ్ఎంఎస్ దవాఖాన సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్‌లో అపోలో దవాఖాన తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లిచూడగా అతడి మృతదేహం కనిపించింది.
గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని, డెంటల్ దవాఖాన వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడంటూ మృతుడి తండ్రి రాములు ఈ నెల 17న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 304 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టో పాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Bird Flu Vaccine | స్వదేశీ బర్డ్ ఫ్లూ టీకా వచ్చేసింది.. కోళ్లకు ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

