జక్రాన్‌పల్లి, మార్చి 24: రైతాంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోతే గ్రామా ల్లో తలెత్తుకుని తిరగలేమని నిజామాబాద్ జి ల్లా జక్రాన్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి వాపోయారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రై తులకు ఇచ్చిన మాట ప్ర కారం రుణమాఫీ చేయాలని కోరారు. లేకుంటే కాంగ్రెస్ నాయకులు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వస్తుందని వా పోయారు. అన్ని దేవుళ్లపై ఒట్టు వేసి మరీ మాట ఇచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదని హితవు పలికారు. దశలవారీగానైనా రుణమాఫీ చేయాలని కోరారు. లేకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.