హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పెన్షన్ పెంచాలని ఆలిండియా డిసేబుల్డ్ రైట్స్ ఫోరం (ఏఐడీఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఏఐడీఆర్ఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు పెన్షన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆరు నెలలు గడిచినా సీఎం రేవంత్రెడ్డి దీనిపై స్పందించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రవీందర్ తదితరులున్నారు.