Amrapali Kata | ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటకు క్యాట్‌లో ఊరట కలిగింది. ఆమెను తెలంగాణకే తిరిగి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఆదేశాలతో గతేడాది అక్టోబర్‌లో ఆమె ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె తనను తెలంగాణకే కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమ్రపాలి పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అనుమతి ఇస్తూ తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వాస్తవానికి తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితో పాటు ఐఏఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వంటి ఐపీఎస్ అధికారులను కేంద్రం ఏపీ కేడర్‌ను కేటించింది. తెలంగాణకు కేటాయించగా.. ఏపీలో కొనసాగుతున్న అధికారులైన సృజన, శివశంకర్, హరికిరణ్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.
డీవోపీటీ ఆదేశాలతో ఆయా అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వారికి ఏపీ ప్రభుత్వం పలు శాఖల బాధ్యతలు అప్పగించింది. అయితే, తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆమ్రపాలి ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు కోరారు. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. న్యాయంగా తెలంగాణలోనే కొనసాగించాలని.. కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు.