హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (Passing Out Parade) నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్లో 213 మంది క్యాడెట్లు సైనిక విన్యాసాలు చేశారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, డోర్నియర్, హాక్, కిరణ్, చేతక్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
VIDEO | Visuals of Combined Graduation Parade being held at Air Force Academy, Dundigal, #Telangana.
(Source: Third Party) pic.twitter.com/Ad6coykZO1
— Press Trust of India (@PTI_News) June 15, 2024