Student Missing | అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. డబ్బు ఇవ్వకుంటే కిడ్నీ అమ్మేస్తామంటూ కిడ్నాపర్ల బెదిరింపులు
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు.
Student Missing | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు (Student Missing). హైదరాబాద్ (Hyderabad)కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి గత రెండు వారాలుగా కనిపించకుండా పోయాడు. అయితే, అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌లోని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. 1,200 డాలర్లు ఇస్తే అబ్దుల్‌ను సురక్షితంగా విడిచిపెడతామని బెదిరించారు (ransom call).
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ క్లేవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే, అతడు మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అమెరికాలోని అబ్దుల్ బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విద్యార్థి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అబ్దుల్‌ను గుర్తించడంలో సహాయం కోరుతూ అతడి కుటుంబం మార్చి 18న చికాగోలోని భారత కాన్సులేట్‌ను కూడా ఆశ్రయించారు.
ఇంతలోనే హైదరాబాద్‌లో ఉన్న అబ్దుల్ తండ్రి అహ్మద్ సలీమ్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామని, అతన్ని విడిచిపెట్టాలంటే 1,200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అబ్దుల్ కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లీవ్‌ల్యాండ్ పోలీసులు సైతం అబ్దుల్ అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Tamilisai Soundararajan | ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్
Sidhu Moose Wala | బిడ్డ పుట్టిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది.. సిద్ధూ తండ్రి ఆవేదన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

