హైదరాబాద్ : మనం వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసి వివిధ వస్తువులను తయారు చేస్తున్నది చూస్తున్నాం. పాత బాటిళ్లను గ్రాన్యూల్స్‌గా చేసి ఒకరు టీ షర్ట్లు తయారుచేయగా.. మరొకరు పెట్ బాటిల్స్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ఇలాంటి వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన బూట్లను మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? ఈ పర్యావరణ అనుకూల బూట్లను (Plastic Shoe) మన హైదరాబాద్‌లోనే తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
బ్రాండెడ్ రిలైవ్ నిట్స్ కంపెనీ అయిన ‘నీమన్’ హైదరాబాద్ నగరంలో స్థాపించారు. ఈ సంస్థ వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి అందమైన షూ తయారుచేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో తమ వంతు సహకారం అందిస్తున్నారు. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను శుభ్రంగా కడిగి ముక్కలు చేస్తారు. ఈ చిప్స్ కరిగించి చల్లబడిన తర్వాత డై అప్లై చేస్తారు. వీటి నుంచి నూలు వంటి పొడవాటి తాళ్లను తయారుచేసి మరోసారి శుద్ధి చేస్తారు. అనంతరం 3డీ అల్లిక యంత్రం ద్వారా షూ పైభాగంలో కుడతారు. ఆ తర్వాత సహజంగా లభ్యమయ్యే మెటీరియల్స్ అయిన మొక్కల ద్వారా లభించే కాస్టర్ బీన్ ఆయిల్, రీసైకిల్ రబ్బర్, వేస్ట్ పేపర్ ఉపయోగించి లోపలి సోల్‌ను తయారు చేస్తారని ‘నీమర్’ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. దాంతో లోపలి భాగం కుషన్ మాదిరిగా మెత్తగా ఉంటుందని ఆయన చెప్పారు. చెడు వాసనలు రాకుండా చూడటం, చెమటను గ్రహించడం ఈ సోల్ ప్రత్యేకతలని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను కరిగించి యార్న్ తయారుచేసే కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకుని తమ షూ తయారీకి వినియోగిస్తున్నట్లు చెప్పారు.
నగర ఆధారిత స్టార్టప్‌గా నెలకొల్పిన ఈ కంపెనీ సిరీస్-ఏ రౌండ్‌కు ఇటీవల సిక్స్త్ సెన్స్ వెంచర్స్ నుంచి రూ.20 కోట్ల నిధులను కంపెనీ వ్యవస్థాపకులు తరణ్ ఛబ్రా, అమర్ ప్రీత్ సేకరించారు. ఈ కంపెనీలో ఫ్లిప్ ఫ్లాప్స్, స్లైడ్స్, రీసైకిల్డ్ కాటన్ స్నీకర్స్ వంటి ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. రిలైవ్ నిట్స్ స్నీకర్స్, స్లిప్ ఆన్ వరుసగా 7, 5 రంగుల్లో లభిస్తున్నాయి. వీటి ధర రూ.3,299 గా నిర్ణయించారు. ఈ పర్యావరణ అనుకూల బూట్లను నీమన్ సంస్థ వెబ్సైట్ – www.neemans.com తో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో కూడా అందుబాటులో లభిస్తున్నాయి.
నష్టాలు పెరుగుతున్నా.. వేగం పుంజుకుంటున్న జోమాటో
ఆఫ్ఘాన్‌లో దిగజారిన పరిస్థితి : ఇండియా తిరిగొచ్చిన 50 మంది
డయాబెటిస్‌ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..