హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.6, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 40.4 కొమ్రంభీం జిల్లా కరిమేర, నిర్మల్ జిల్లా ఠానూర్లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.
ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.