Rain update | హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని సూచించింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
శుక్రవారం నుంచి శనివా రం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడతాయని ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సా యంత్రం వరకు రంగారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు, నాగర్కర్నూల్ జిల్లాలో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలో 5 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 5 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లాలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.