ఐటీ కారిడార్‌లో మరో స్టార్ హోటల్ రానున్నది. మైండ్‌స్పేస్ జంక్షన్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇక్కడ ఇప్పటికే ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్ ఉండగా, తాజాగా మరో స్టార్ హోటల్ 15 అంతస్థుల్లో నిర్మాణ ప్రతిపాదనలు వచ్చాయి. ఐకియా-మైండ్‌స్పేస్ జంక్షన్‌ను ఆనుకొని ఎల్అండ్టీ మెట్రోకు కేటాయించిన సుమారు 3 ఎకరాలకు పైగా స్థలంలో దీనిని నిర్మించనున్నారు.
రూ.500 కోట్లతో వినూత్నంగా ఈ స్టార్ హోటల్ డిజైన్ చేశారు. మొత్తం 8.86లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించే ఈ భవనంలో 8 అంతస్థుల స్టార్ హోటల్లో సుమారు 200 గదులు, ట్రేడ్ సెంటర్ కోసం 4 అంతస్థులను కేటాయించనున్నారు.
– హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ