Yadadri Laddu | యాదగిరిగుట్ట ప్రసాదాలపై అప్రమత్తం.. హైదరాబాద్ ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు
Yadadri Laddu | తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను హైదరాబాద్‌లోని ఆహార ప్రయోగశాలకు పంపించారు.
ఈ నెల 30న నివేదిక
యాదగిరిగుట్ట ప్రసాదంలో 40 ఏండ్లుగా నార్మూల్ నెయ్యి వినియోగం
Yadadri Laddu | యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 24 : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను హైదరాబాద్‌లోని ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ నెయ్యిలో ఏదైనా కల్తీ జరిగిందా.. అని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఈ నెల 30లోపు వస్తుందని ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
కాగా, దేవస్థానంలోని లడ్డూ ప్రసాదాల తయారీలో 40 ఏండ్లుగా నార్మూల్ సంస్థకు చెందిన నెయ్యిని వినియోగిస్తున్నారు. నెలకు సుమారు 20 నుంచి 25 వేల కిలోల నెయ్యిని వాడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఒక్కో లడ్డూకు 90 నుంచి 100 గ్రాముల నెయ్యిని వినియోగిస్తున్నారు. దాంతోపాటు లడ్డూ తయారికి కావాల్సిన యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ పొడి, చక్కెర పాకం, బూంది వంటి ముడి సరుకులు సైతం తాజాగా సేకరించి వినియోగిస్తున్నారు. రోజు అనుభవజ్ఞులైన తయారీదారులతో పరీక్షించి మరీ భక్తులకు అందజేస్తున్నారు.
యాదగిరిగుట్ట ఆలయం పునఃప్రారంభం తర్వాత ప్రసాదాలు సిద్ధం చేసేందుకు అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.13.8 కోట్లతో భారీ యంత్రాలను చెన్నై, పుణే, హర్యానా, ముంబయి, రాజమండ్రి వంటి ప్రదేశాల నుంచి తీసుకొచ్చి మానవ రహిత లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. బూంది ప్రైయర్, షుగర్ సీరప్ మిషన్స్, దాల్ పుల్వలైజర్, గ్రైండింగ్ మిషన్, చక్కెర సైలోస్ మిషన్ వంటి ఆధునాత యంత్రాలలో లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. బోగ్ (దేవుడికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) సంస్థ దేవస్థాన ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తపరిచింది. యాదగిరిగుట్టలో ఆరోగ్యకరమైన నాణ్యత ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయని కితాబునిస్తూ గతేడాది మార్చి 28న బోగ్ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సర్టిఫికెట్‌ను పొందిన దేవాలయంగా యాదగిరిగుట్ట క్షేత్రం నిలిచింది.
ఇవి కూడా చదవండి..
Telangana | ఊరూరా లిక్కర్ మాల్స్? రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

