(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జాతీయ మీడియా అమ్ముడుపోయిందని కామెంట్ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో సోమవారం పోస్ట్ పెట్టారు. సంధ్యా థియేటర్ వ్యవహారంపై ఆదివారం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత జాతీయ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. రెచ్చగొట్టేలా ప్రశ్నలు వేయడంతో కాస్త సహనాన్ని కోల్పోయానని విచారం వ్యక్తంచేశారు.