హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): గంజాయి, డ్రగ్స్, నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, ఐడీ లికర్పై మరింత దృష్టిపెట్టాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి ఆదేశించారు. గురువారం డీసీఏ సమావేశ మందిరంలో ఎస్టీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ టీమ్లు, డీసీఏ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్లు చేపట్టిన దాడులు, తనిఖీల్లో ప్రతిభ కనబరిచినవారికి నగదు ప్రోత్సాహక రివార్డులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీఎఫ్ టీమ్లు అనతికాలంలోనే 415.25 కేజీల గంజాయి, 1.1 కేజీల అల్ప్రాజోలం, 43.08 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 52.5 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ పట్టుకున్నాయని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్, ఎక్సైజ్ టీమ్లు 799.25 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, 2,500 కేజీల బెల్లం, కేజీన్నర హషిష్ అయిల్, 400 గ్రాముల ఓపీఎం పట్టుకున్నాయని తెలిపారు.