Srisailam | హైదరాబాద్ ప్రైమార్క్ ఎంటర్ప్రైజెస్కు చెందిన బీ సాంబశివరావు ఆదివారం శ్రీశైలం దేవస్థానానికి ఫోటో కెమెరా అందజేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర ఆజాద్, శ్రీ స్వామి వార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ, ప్రజాసంబంధాల అధికారి టీ శ్రీనివాసరావు సమక్షంలో ఈ కెమెరాను దేవస్థానానికి అందజేశారు. ఈ కెమెరా, లెన్సుల విలువ సుమారు రూ. 5.92 లక్షలు ఉంటుందని దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలను అందజేశారు.