ICAI Results | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి వై గోకుల్‌సాయి శ్రీకర్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 800 మార్కులకు 688 మార్కులు (86.00 శాతం) సాధించిన శ్రీకర్ ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. పాటియాలాకు చెందిన నూర్ సింగ్లా రెండో ర్యాంకు, ముంబై విద్యార్థి కావ్య సందీప్ కొఠారి మూడో ర్యాంకు సొంతం చేసుకున్నారు. మే నెలలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాల్లో గ్రూప్-1లో కేవలం 18, గ్రూప్ -2లో 23, రెండింటిలో 10 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
సీఏ ఫైనల్ ఫలితాలు సైతం బుధవారమే విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అహ్మదాబాద్‌కు చెందిన జైన్ అక్షయ్ రమేశ్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. చెన్నైకి చెందిన కల్పేశ్ జైన్జీ రెండో ర్యాంకు, న్యూఢిల్లీకి చెందిన ప్రకార్ వార్షనే మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. సీఏ ఫైనల్లో గ్రూప్-1లో 11 శాతం, గ్రూప్ -2లో 31 శాతం, రెండింటిలో 8 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
మా కుటుంబం హైదరాబాద్‌లోని జేఎన్టీయూ వద్ద ఉంటున్నది. నాన్న వై మారుతికుమార్ కరూర్ వైశ్యాబ్యాంక్‌లో పనిచేస్తారు. సీఏ కోసం నేను ఎంతగానో కష్టపడ్డా. రోజుకు 12-16 గంటలు ప్రణాళికాబద్ధంగా చదివా. అమ్మానాన్నలు ఎంతగానో ప్రోత్సహించారు. దీంతోనే విజయం సాధించగలిగా. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏదో మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నా కానీ ఆలిండియా మొదటి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. సీఏ ఫైనల్ పూర్తిచేసి మంచి మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీకి సీఎఫ్‌వో కావాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నిస్తా.