హుస్నాబాద్, ఫిబ్రవరి 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్‌రిజిస్ట్రార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పుడు ధ్రువపత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఫిర్యాదు మేరకు గురువారం హుస్నాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కొంతకాలంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇందులో సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బంది కూడా నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.