Crime news | భార్యను చంపి భర్త సూసైడ్.. అనాథలైన ముగ్గురు పిల్లలు
Crime news | కుటుంబ తగాదాల తో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రేటర్ వరంగల్‌లో మంగళవారం చోటుచేసుకుంది.
కాశీబుగ్గ, జూలై 9: కుటుంబ తగాదాల తో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రేటర్ వరంగల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని 18 వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీకి చెందిన మం ద చేరాలు (45), స్వప్న (42) దంపతు లు. వీరికి అంధుడైన కుమారుడితోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చేరాలు మేస్త్రీ పనిచేస్తుండగా, స్వప్న బట్టల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. చేరాలు స్వప్నను రోకలిబండతో తలపై బాది హత్య చేశాడు.
మంగళవారం ఉదయం చేరాలు పురుగు మందు తాగి మృతి చెందాడు. ఉదయం 11 గంటల సమయంలో పిల్లలను బంధువులు తీసుకురాగా ఇంటికి గొల్లెం పెట్టి ఉన్నది. పక్క నుంచి తలుపులు తీసి చూడగా వారు విగతజీవులుగా పడి ఉన్నారు. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
ఇవి కూడా చదవండి..
పాముకాటుతో రైతు మృతి
కల్వకుర్తి రూరల్, జూలై 9: పొలం వ ద్ద పాముకాటుతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణం జేఎల్బీ రోడ్డులో ఉండే రైతు వసంత యాదయ్య (48) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఎల్లికల్ రోడ్డు కైలాసంగుట్ట సమీపంలో బోరు మోటరు ఆన్‌చేసే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. పక్కపొలంలోని రైతులు గమనించి అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

