చెట్లతోనే మానవ మనుగడ : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

నిర్మల్ : చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ భాగంగా జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం గత ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి రహదారికి ఇరువైపుల నాటిని మొక్కలను వారు పరిశీలించారు.
ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలతో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెరిగిందన్నారు. స్థానిక స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయడంతో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చేందాయని తెలిపారు. పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ను నిరోధించేందుకు సహాకరించాలని మంత్రి కోరారు.
గతంతో పోలిస్తే గ్రామాల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. కలుషిత నీరు తాగడం, పారిశుద్ధ్యం లోపించడం తో సీజనల్ వ్యాధులు వ్యాపించేవన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు ఇవ్వడంతో సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

