సిద్దిపేట: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద వస్తుండటంతో బస్వాపూర్ బ్రిడ్జిపై మునిగిపోయింది. దీంతో సిద్దిపేట, హనుమకొండ రహదారిలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాగా, మోయతుమ్మెద వాగు, మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు (LMD) వైపు వరద పోటెత్తింది. దీంతో దిగువ మానేరు వైపు 78 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు 16 గేట్లు ఎత్తి 91 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ మానేరు గరిష్ట నీటి నిల్వ 24 టీఎంసీలు. ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.